Sat Apr 11 2026 06:31:10 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : పీఏసీఎస్ లకు నూతన కమిటీలను నియమించిన ఏపీ సర్కార్
ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన కమిటీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది

ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన కమిటీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఖాళీగా ఉన్న సొసైటీలకు ఛైర్మన్లను, కమిటీ సభ్యులను నియమించింది. రైతులకు అవసరమైన సాయం అందించేందుకు అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకునే విధంగా ఈ పాలకవర్గాలను నియమించినట్లు పాలక వర్గం ప్రకటించింది.
మొత్తం 847 సొసైటీలకు...
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 847 ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలకు కమిటీలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 847 సొసైటీలకు ఛైర్ పర్సన్లు, సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వీరంతా వచ్చే ఏడాది జనవరి 30 వరకు పదవిలో కొనసాగనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు తగు కార్యాచరణ సిద్ధం చేయాలని సహకార శాఖ కో ఆపరేటివ్ సొసైటీల కమిషనర్‌ను ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ ఆదేశించారు.
News Summary - andhra pradesh government has issued orders appointing new committees for primary agricultural cooperative credit societies
Next Story

