Sun Mar 15 2026 14:29:17 GMT+0530 (India Standard Time)
ఏబీకి ఏపీ సర్కార్ షోకాజ్ నోటీస్
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. . ప్రభుత్వ పదవిలో ఉండి మీడియాతో మాట్లాడటంపై ఆయనకు ఈ నోటీసులు జారీ చేసింది. ఇటీవల పెగాసస్ స్పైవేర్ పై ఏబీ వెంకటేశ్వరరావు మీడియా సమావేశం పెట్టారు. గత ప్రభుత్వ హయాంలో పెగాసస్ స్పై వేర్ కొనలేదని స్పష్టం చేశారు. 2019 మే నెల వరకూ తనకు తెలిసినంత మేరకు అప్పటి ప్రభుత్వం పెగాసస్ స్పై వేర్ ను కొనలేదని ఆయన స్ఫం చేశారు.
సర్వీస్ రూల్స్ ఉల్లంఘించి......
ఆలిండియా సర్వీస్ రూల్స్ ఉల్లంఘించి మీడియా సమావేశం పెట్టారని ఏపీ ప్రభుత్వం షోకాజ్ నోటీసుల్లో పేర్కొంది. దీంతో పాటు ఏబీ వెంకటేశ్వరరావు కొందరు వైసీపీ నేతలపై పరువు నష్టం దావా వేయడానికి చీఫ్ సెక్రటరీ అనుమతి కూడా కోరారు. ఏబీ వెంకటేశ్వరరావు ఈ నోటీసుకు సరైన సమాధానం చెప్పాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొంది.
Next Story

