Fri Dec 05 2025 16:20:28 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో రెండు స్పేస్ సిటీలకు న్యూ పాలసీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త పాలసీని అమలులోకి తీసుకు రానుంది. స్పేస్ పాలసీని ప్రభుత్వం ప్రవేశపెట్టింది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త పాలసీని అమలులోకి తీసుకు రానుంది. స్పేస్ పాలసీని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. స్పేస్ పాలసీ ద్వారా ప్రత్యక్షంగా ఐదు వేల మందికి, పరోక్షంగా ముప్ఫయి వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అధికారులు తెలిపారు. మొత్తం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడుల లక్ష్యంతో ఈ స్పేస్ 4.0 ను రూపొందించినట్లుు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
విద్యార్థులే లక్ష్యంగా...
అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దామని అన్నారు. ఈ స్పేస్ సిటీలను లేపాక్షి, తిరుపతి ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. స్పేస్ పరిశ్రమలకు ఇరవై ఐదు నుంచి నలభై ఐదు శాతం వరకూ పెట్టుబడుల రాయితీలను కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. ఈ స్పేస్ సిటీలో విద్యార్థులను భాగస్వామ్యులను చేయడమే లక్ష్యంగా ఏర్పాటు చేయబోతున్నామని, తుది పాలసీ రూపకల్పనపైనే నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారని అధికారులు తెలిపారు.
Next Story

