Fri Dec 05 2025 19:10:00 GMT+0000 (Coordinated Universal Time)
Vijayawada : బెజవాడలో ఉచిత బస్సు సర్వీసులు
విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత బస్సులను ప్రవేశపెట్టింది.

విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత బస్సులను ప్రవేశపెట్టింది. వరద బాధితులు తమ ప్రాంతాలకు చేరుకోవడానికి ఈ ఉచిత బస్సుల్లో ప్రయాణించవచ్చు. ప్రధానంగా ఇటీవల కృష్ణానది వరదలకు గురైన ప్రాంతాల ప్రజలకు ఈ బస్సులను అందుబాటులో ఉంచారు. అజిత్ సింగ్ నగర్ నుంచి విజయవాడలోని అనేక ప్రాంతాలకు చేరుకునేందుకు ఈ బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు.
కాని నడకన బయలుదేరడంతో...
మరోసారి భారీ వర్షాలు పడతాయని, మళ్లీ వరద ముప్పు ఉందని హెచ్చరికలు రావడంతో ప్రజలు కాలినడకన బయలుదేరారు. దీంతో ప్రభుత్వం వారి కోసం ఉచిత సర్వీసులను ప్రారంభించింది. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను ప్రారంభించారు. వందల సంఖ్యలో ఫైర్ ఇంజిన్లు బురదను తొలగిస్తున్నాయి. యుద్ధప్రాతిపదికన సాధారణ స్థితికి తీసుకురావాలన్న ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది.
Next Story

