Sat Dec 06 2025 15:55:30 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : భూములు, ఇళ్లు కొనుగోలు చేసే వారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
భూములు, ఇళ్లు కొనుగోలు చేసే వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది

భూములు, ఇళ్లు కొనుగోలు చేసే వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కాలయాపన చేయకుండా, పడిగాపులు కాకుండా నిర్ణయం తీసుకుంది. ఏపీలో రిజిస్ట్రేషన్ శాఖలో కీలక మార్పులు చేసింది. ఇక కార్యాలయాల బయట పడిగాపులు అవసరం లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది.
నిరీక్షించే అవసరం లేకుండా...
ఇక నుంచి రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిరీక్షించే అవసరం లేకుండా ముందుస్తుగా స్లాట్ బుకింగ్ విధానం అమలు చేయనుంది. మొన్నటి వరకు భూముల రిజిస్ట్రేషన్ కోసం వెళ్తే గంటల తరబడి వెయిటింగ్ చేయాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు వెయిటింగ్ చేయకుండా రిజిస్ట్రేషన్ సమయానికి వెళ్తే సరిపోతుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ సదుపాయం అమల్లోకి రానుందని ప్రభుత్వం తెలిపింది.
Next Story

