Fri Dec 05 2025 12:08:13 GMT+0000 (Coordinated Universal Time)
Senior Citizens : సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. ఈ కార్డు ఉంటే చాలు.. ఇక?
సీనియర్ సిటిజెన్ లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

సీనియర్ సిటిజెన్ లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని వృద్ధుల కోసం ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ముందు సీనియర్ సిటిజన్ కార్డు కోసం దరఖాస్తు చేయాలంటే ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు సీనియర్ సిటిజన్ కార్డు పొందాలంటే కార్డుకు నలభై రూపాయలు దరఖాస్తు రుసుముగా వసూలు చేస్తుంది. అయితే ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో సీనియర్ సిటిజన్ కార్డుు ఇప్పుడు పూర్తి ఉచితంగా అందించనుంది.
అర్హతలివే
సీనియర్ సిటిజన్ కార్డు పొందాలంటే లబ్దిదారులు ఖచ్చితంగా ఈ అర్హతలుండాలని ప్రభుత్వం పేర్కొంది. పురుషులకు అరవై ఏళ్లు నిండి ఉండాలి. మహిళలకు యాభై ఎనిమిదేళ్లు నిండాల్సి ఉంటుంది. వీరు మాత్రమే సీనియర్ సిటిజన్ కార్డు పొందేందుకు అర్హులు. ఈ సీనియర్ సిటిజన్ కార్డును ఆంధ్రప్రదేశ్ లో తీసుకున్నప్పటికీ దేశ వ్యాప్తంగా అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని తెలిపింది. అర్హులైన వారంతా గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మీ సేవ కేంద్రాల నుంచి కూడా పొందవచ్చు. ఇంటర్నెట్ సెంటర్ల నుంచి మొబైల్ నుంచి కూడా ఈ కార్డుపై అవగాహన ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకుని కార్డును పొందే వీలుంది.
కార్డు పొందాలంటే...
ఇక సీనియర్ సిటిజన్ కార్డు పొందాలంటే ఈ డాక్యుమెంట్లు అవసరమవుతాయి. వయసు ధృవీకరణ కు సంబంధించి ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డు ను ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటు అడ్రస్ ప్రూఫ్, ఫోటో, బ్లడ్ గ్రూప్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్లు, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కార్డు పొందిన వారికి ఆర్టీసీ బస్సుల్లో ఇరవై ఐదు శాతం రాయితీ లభిస్తుంది. ప్రతి బస్సులో రెండు సీట్లు రిజర్వ్ చేసి ఉంటాయి. రైల్వేలో ప్రత్యేక కౌంటర్లు, వీల్‌ఛైర్ సదుపాయం, లోయర్ బెర్త్ ప్రాధాన్యత ఇస్తారు. పాస్‌పోర్టు ఫీజులో శాతం తగ్గింపు ఉంటుంది. బ్యాంకుల్లో ప్రత్యేక క్యూ లైన్లు, సేవల్లో ప్రాధాన్యం ఇస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్లపై అదనపు వడ్డీ రేటు లభిస్తుంది. 60 సంవత్సరాల నుంచి 79 ఏళ్ల వారికి 0.5 శాతం, 80 సంవత్సరాలు పైబడినవారికి 1 శాతం లభిస్తుంది. ఆదాయ పన్ను మినహాయింపు లభిస్తుంది.
Next Story

