Fri Dec 05 2025 11:14:13 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో డ్వాక్రా మహిళలకు తీపికబురు...రెండు పథకాలు ఒకేసారి అమలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది.రెండు కొత్త పథకాలకు త్వరలో శ్రీకారం చుట్టింది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. డ్వాక్రా మహిళలకు చెందిన పిల్లల చదువు, ఆడబిడ్డల వివాహాలకు పావలా వడ్డీకే రూ.లక్ష రుణం అందించనుంది. స్త్రీనిధి కింద పావలా వడ్డీకే అందచయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు కొత్త పథకాలకు త్వరలో శ్రీకారం చుట్టింది. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం కింద ఈ రుణం అందచేస్తారు. ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి పథకం కింద కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద డ్వాక్రా మహిళల కుటుంబాల్లోని పిల్లల వివాహాలకు రుణం ఇస్తారు.
విద్యాలక్ష్మి పథకం కింద...
డ్వాక్రా సంఘంలో నమోదై కనీసం ఆరు నెలలు గడిచిన సభ్యురాలికి ఈ పథకం వర్తిస్తుంది. ఇప్పటికే బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, ఇతర మార్గాల్లో తీసుకున్న అప్పును చెల్లించే వారికి కూడా ఇస్తారు. బయోమెట్రిక్ ఆధారంగా అమలు చేయనున్నారు. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం కింద డ్వాక్రా గ్రూపు మహిళల కుటుంబాల్లోనిగరిష్ఠంగా ఇద్దరు పిల్లల చదువులకు పది వేల నుంచి రూ. లక్ష వరకు రుణసాయం అందిస్తారు. పాఠశాలలు, కళాశాలల్లో పిల్లల ఫీజుకు అను గుణంగా అవసరమైన మొత్తాన్ని తీసుకోవచ్చు. పావలా వడ్డీకి ఇస్తారు. తీసుకున్న మొత్తానికి అనుగుణంగా చెల్లింపు వాయిదాల సంఖ్య ఉంటుంది. గరిష్ఠంగా 48 వాయిదాల్లో చెల్లించాలి. అడ్మిషన్ లెటర్, ఫీజు చెల్లింపు విధానం, ఇన్ స్టిట్యూట్ వివరాలు, రసీదును సమర్పించాలి. దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లో సభ్యురాలి బ్యాంకు ఖాతాలో నేరుగా నగదు జమ చేస్తారు.
ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి కింద...
ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి కింద డ్వాక్రా సభ్యురాలి కుమార్తె వివాహానికి ఈ పథకం వర్తిస్తుంది. అవసరానికి అనుగుణంగా పది వేలరూపాయల నుంచి రూ.లక్ష వరకు రుణంగా తీసుకునే వెసులుబాటు ఉంది. పావలా వడ్డీకి రుణం అందిస్తారు.తీసుకున్న మొత్తానికి అనుగుణంగా చెల్లింపు వాయిదాల సంఖ్య ఉంటుంది. గరిష్ఠంగా 48 వాయిదాల్లో చెల్లించాలి. లగ్న పత్రిక, ఈవెంట్ నిర్వహణకు సంబంధించిన పత్రం, పెళ్లి ఖర్చు అంచనా వ్యయం పత్రాలను సమర్పించాలి. వివాహానికి సంబంధించిన వివరాల పరిశీలన అనంతరం నేరుగా సభ్యురాలి బ్యాంకు ఖాతాలో నగదు జమ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా పండగకు ముందే డ్వాక్రా మహిళలకు తీపికబురు అందిస్తూ రెండు పథకాలను ప్రకటించింది.
Next Story

