Sat Mar 07 2026 19:36:27 GMT+0530 (India Standard Time)
మహిళ ఉద్యోగులకు గుడ్ న్యూస్
ఏపీ ప్రభుత్వం మహిళ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. చైల్డ్ కేర్ సెలవుల కాలవ్యవధి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ సెలవుల కాలవ్యవధి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 180 రోజుల చైల్డ్ కేర్ సెలవులు గతంలో పిల్లలకు 18 యేళ్లు వచ్చే వరకు మాత్రమే వర్తించేవి. ప్రస్తుతం సర్వీస్ కాలంలో ఎప్పుడైనా వాడుకోవచ్చు అని ప్రభుత్వం వెల్లడించింది.
ఎమ్మెల్సీల విజ్ఞప్తి మేరకు...
కొత్తగా ఎన్నికైన టీచర్ ఎమ్మెల్సీల విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి జగన్ ఈ చైల్డ్ కేర్ సెలవులను ఎప్పుడైనా వినియోగించుకునే అవకాశంొ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.
Next Story

