Fri Dec 05 2025 12:25:08 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ చెప్పింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ చెప్పింది. యువత తమ కాళ్ల మీద నిలబడేందుకు అవకాశాన్ని కల్పిస్తూ అవగాహన ఒప్పందాలు జరిగాయి. రాష్ట్రంలో నిరుద్యోగ యువతి , యువకులకు నైపుణ్యాభివృద్ధి మరియు సాధికారత కల్పించేందుకు యునిసెఫ్‌తో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం , యూనిసెఫ్ మూడు ప్రధాన యువశక్తి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయినట్లే. ఈ మేరకు ఏపీఎస్డీసీ , యునిసెఫ్ ప్రతినిధులు, విద్య , ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఎంవోయూపై సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందం ద్వారా యునిసెఫ్ , ఏపీఎస్ఎస్ డీసీ పరస్పర సహకారంతో యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ , యూత్ హబ్ , పాస్‌పోర్ట్ టు ఎర్నింగ్ కార్యక్రమాలను అమలు చేస్తారు. ఇంటికో వ్యాపారవేత్త , స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు ఇవి ఎంతగానో తోడ్పాటును అందించనున్నాయి.
కొత్త ఆవిష్కరణలతో...
యువతలో నవీన ఆవిష్కరణలు , ఇంక్లూజన్ , స్థిర జీవనోపాధి అవకాశాలను పెంపొందించుకుంటున్నాయి. యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ ద్వారా పాలిటెక్నిక్ , డిగ్రీ , ఇంజనీరింగ్ అభ్యసించే రెండు లక్షల మంది యువతకు వ్యాపార నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు ఉద్యోగాలు సృష్టి జరగనుంది. సమస్యల పరిష్కార నైపుణ్యాలను యూనిసెఫ్ గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్ ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు. యూత్ హబ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ నైపుణ్యం పోర్టల్‌తో అనుసంధానించిన బహుభాషా డిజిటల్ వేదిక ద్వారా యువతకు ఉద్యోగాలు , నైపుణ్యాభివృద్ధి , వాలంటీర్‌షిప్ అవకాశాలను కల్పించనున్నారు పాస్‌పోర్ట్ టు ఎర్నింగ్ కార్యక్రమం ద్వారా 15 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల మధ్యగల యువతకు ఉచితంగా అంతర్జాతీయ స్థాయిలో డిజిటల్ , ప్రొఫెషనల్ నైపుణ్యం శిక్షణను అందిస్తారు.
చంద్రబాబు ఆలోచనలను...
దీనివల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడటమే కాకుండా యువతలోకూడా సొంతంగా చిన్న స్థాయి పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని వారు జీవితంలో నిలదొక్కుకోవడమే కాకుండా పది మందికి ఉపాధి అవకాశాలు కల్పించే ఛాన్స్ లభించనుంది. ఎంఎస్ఎంఈ పరిశ్రమలను అత్యధికంగా ప్రోత్సహిండమే లక్ష్యంగా ఈ కొత్త విధానంలో చంద్రబాబు ఆలోచనలకు తగినట్లుగా ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న లక్ష్యంతో ఈ పనికి శ్రీకారం చుట్టింది. దీంతో లక్షలాది మంది నిరుద్యోగులు తమ సొంత కాళ్లమీద నిలబడటానికి సంబంధించిన అవసరమైన నైపుణ్యంతో పాటు మార్కెటింగ్ టెక్నిక్స్ కూడా నేర్పించనున్నారు. తద్వారా తమ ఉత్పత్తులను ప్రపంచ వ్యాప్తంగా విక్రయించుకునే వీలు కల్పించేందుకు అవకాశముంది.
Next Story

