Thu Mar 19 2026 09:48:58 GMT+0530 (India Standard Time)
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆరోగ్య శ్రీ సేవలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పినట్లయింది. కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యంతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పినట్లయింది. కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యంతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఆరోగ్య శ్రీ సేవలు పునరుద్ధరిస్తామని కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యం తెలిపింది. ఈరోజు నుంచే అన్ని ప్రయివేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
బకాయీలను...
తమకు ఉన్న బకాయీలను విడుదల చేయాలంటూ కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యం ఆరోగ్య శ్రీ సేవలను నిలిపేసింది. దాదాపు 2,500 కోట్ల రూపాయలు బకాయీలు ఉన్నాయని వాటిని చెల్లించాలని కోరింది. అయితే దశల వారీగా ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కావడంతో ఆరోగ్య సేవలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.
Next Story

