Fri Dec 05 2025 13:18:04 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : విద్యార్థులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫీజు రీఎంబర్స్ మెంట్ నిధులను విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫీజు రీఎంబర్స్ మెంట్ నిధులను విడుదల చేసింది. విద్యార్థులకు సంబంధించి ఫీజు రీఎంబర్స్ మెంట్ కింద ఆరు వందల కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. గతంలో మొదటి విడతగా ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకం కింద 788 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశామని ఉన్నత విద్యాశాఖ తెలిపింది.
ఫీజు రీఎంబర్స్ మెంట్ నిధులను...
ఈ ఆరువందల కోట్ల రూపాయల నిధుల విడుదలతో 2024 -25 సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీఎంబర్స్ మెంట్ కు సంబంధించిన నిధులను మొత్తం విడుదల చేసినట్లు అవుతుందని ఉన్నత విద్యాశాఖ తెలిపింది. ఈ ఆరువందల కోట్ల రూపాయల నిధుల విడుదలతో ఈ ఏడాదికి సంబంధించిన నిధులు మొత్తం విడుదల చేసినట్లు పేర్కొంది.
Next Story

