Mon Jun 23 2025 02:56:47 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : రేపు పాఠశాలలు ప్రారంభం.. విద్యార్థులకు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. విద్యార్థులకు సన్నబియ్యంతో వండిన భోజనాన్ని రేపటి నుంచి అందించనుంది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. విద్యార్థులకు సన్నబియ్యంతో వండిన భోజనాన్ని రేపటి నుంచి అందించనుంది. ప్రభుత్వ పాఠశాలలు ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
సన్నబియ్యంతో...
రేపు బడులు ప్రారంభం సందర్భంగా సన్న బియ్యం అందజేసే కార్యక్రమం జరుగుతుంది. విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకుంది. దీంతో పాటు హాస్టల్స్ ఉంటున్న విద్యార్థులకు కూడా ఇకపై రెండు పూటలా సన్న బియ్యంతో వండిన అన్నాన్ని వడ్డించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Next Story