Fri Jan 30 2026 10:48:45 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్టీసీ ఉద్యోగుకు సర్కార్ గుడ్ న్యూస్
ఆర్టీసీ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

ఆర్టీసీ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు ఊరట కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఏపీఎస్ ఆర్టీసీలో 1/2019 సర్కులర్ ను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయం ద్వారా 48 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఊరట లభించినట్లయింది. 1/2019 సర్కులర్ను పునరుద్దరించాలని ఇటీవల ఎన్ఎంయూఏ గత కొద్దిరోజులుగా ఆందోళన చేస్తుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
సర్క్యూలర్ ను నిలిపేస్తూ...
గత ప్రభుత్వ హయాంలో 1/2019 సర్కులర్ ను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. చిన్న తప్పిదాలకే పెద్ద శిక్షలు విధిస్తున్నారని యాజమాన్యం దృష్టికిఉద్యోగులు తెచ్చారు. 1/2019 సర్కులర్ కు కట్టుబడి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. సిబ్బందిపై చర్యలు తీసుకునే ముందు 1/2019 సర్కులర్ లోని అంశాలు పాటించాలని ఆదేశాలు జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
Next Story

