Mon Jun 23 2025 03:57:39 GMT+0000 (Coordinated Universal Time)
కాంట్రాక్టు ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ లోని గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బంది సేవలు కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది. గురుకులాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది సేవలను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో వేలాది మంది ఆనందపడుతున్నారు.
పదకొండు నెలలు...
ఏపీలో కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గురుకులాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బంది సేవలు కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది.138 మంది కాంట్రాక్ట్ సిబ్బంది కాలపరిమితిని జూన్ 1వ తేదీ నుంచి 11 నెలల పాటు కొనసాగిస్తూ జీవో జారీ చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు వారు విధుల్లో కొనసాగుతారని ఉెత్తర్వుల్లో పేర్కొంది.
Next Story