Fri Dec 05 2025 22:47:56 GMT+0000 (Coordinated Universal Time)
అమరావతిలో ఆరువందల అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహం
అమరావతిలో 600 అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది

అమరావతిలో 600 అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతిలోని నీరుకొండపై 600 అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. విగ్రహ బేస్‌లో ఎన్టీఆర్ జీవితం, కళాకృతులు, మినీ థియేటర్ తదితరాలు ఉండనున్నాయి. డీపీఆర్ తయారీకి కన్సల్టెంట్ కోసం టెండర్లు ఆహ్వానించారు. నందమూరి తారకరామారావు భారీ విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
పటేల్ తరహాలో...
రెండు రోజుల కిందట మునిసిపల్ శాఖ మంత్రి పి.నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, ఏడీసీ సీఎండీ లక్ష్మీ పార్థసారథి గుజరాత్ పర్యటనలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించి వచ్చారు. ప్రాథమిక అంచనాల మేరకు 600 అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందులో నీరుకొండ ఎత్తు 300 అడుగులు ఉంటుంది. దీని మీద 100 అడుగుల ఎత్తులో బేస్‌ను నిర్మిస్తారు. ఈ బేస్‌లోనే ఎన్టీఆర్ మెమోరియల్ హాల్, ఎన్టీఆర్ మ్యూజియం, ఎన్టీఆర్ జీవిత చరిత్ర తెలుసుకునేలా కళాఖండాలు, మినీ థియేటర్, కన్వెన్షన్ సెంటర్ ఉంటాయి. ఈ బేస్ పైన 200 అడుగుల ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.
Next Story

