Wed Jan 21 2026 02:04:01 GMT+0000 (Coordinated Universal Time)
ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు అంతా సిద్ధం
ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది బ్రహ్మాండంగా జరపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది బ్రహ్మాండంగా జరపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట రామాలయం బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 5 నుంచి 15 వరకు నిర్వహించనున్నారు. ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
కల్యాణం సందర్భంగా...
ఏప్రిల్ 11న స్వామి వారి కళ్యాణం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారని చెప్పారు. భోజన వసతి, ప్రసాద వితరణ ప్రతి భక్తునికి అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్వామి వారి కల్యాణాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు.
Next Story

