Sun Mar 15 2026 11:31:40 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : రిజిస్ట్రేషన్ విలువపెంపు పై సర్కార్ లేటెస్ట్ ప్రకటన ఇదే
రిజిస్ట్రేషన్ విలువపెంపు పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటన చేసింది

రిజిస్ట్రేషన్ విలువపెంపు పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పెరిగిన ధరలు అమలులోకి వస్తాయని తెలిపింది. ఈ మేరకు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. డెవలెప్ మెంట్ ఆధారంగా పదిహేను నుంచి ఇరవై శాతం వరకూ పెంచనున్నట్లు తెలిపారు. కొన్ని చోట్ల మాత్రం రిజిస్ట్రేషన్ కు సంబంధించి భూముల విలువ పెంచవద్దంటూ ప్రతిపాదనలు తమకు అందాయని చెప్పారు.
రిజస్ట్రేషన్ లు ఎక్కువగా...
నిజానికి జనవరి 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ విలువలను పెంచుతారంటూ పెద్దయెత్తున ప్రచారం జరగడంతో డిసెంబరు చివరి వారంలో పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. అయితే కొత్త ఏడాది కాకుండా ఫిబ్రవరి 1వ తేదీ నుంచిపెంచాలని నిర్ణయించింది. అభివృద్ధి ఆధారంగానే రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయని మంత్రి తెలపడంతో ఏ ప్రాంతంలో ఎంత మేర పెరుగుతుందన్న లెక్కలు వేసుకుంటున్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

