Sat Mar 07 2026 19:52:29 GMT+0530 (India Standard Time)
ఏపీ ప్రభుత్వానికి మంచి రోజులు.. ఈరోజు వరకూ ఎంత ఆదాయం అంటే?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మంచి ఆదాయం వచ్చింది. మద్యం దుకాణాల ద్వారా అంచనాలకు తగినట్లుగానే ఆదాయం లభించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మంచి ఆదాయం వచ్చింది. మద్యం దుకాణాల ద్వారా అంచనాలకు తగినట్లుగానే ఆదాయం లభించింది. ఈరోజుతో ఆంధ్రప్రదేశ్ లో మద్యం టెండర్ల ప్రక్రియ ముగియనుంది. ఈరోజుతో దరఖాస్తులు చేసుకోవడానికి ఆఖరి రోజు కావడంతో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
నిన్నటి వరకూ...
నిన్నటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 3,396 మద్యం దుకాణాలకు 65696 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో మద్యం దుకాణానికి రెండు లక్షల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకూ లైసెన్స్ ఫీజును ప్రభుత్వం ఫిక్స్ చేసింది. ఈసారి విదేశాల నుంచి కూడా దరఖాస్తులు ఆన్ లైన్ లో వచ్చాయి. విదేశాల నుంచి 26 దరఖాస్తులు ఆన్ లైన్ లో వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. నిన్నటి వరకూ ప్రభుత్వానికి 1,312 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. ఈరోజు మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశముందని అంచనాల్లో ఏపీ ప్రభుత్వం ఉంది.
Next Story

