Mon Mar 02 2026 14:39:29 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. మహిళలపై మూడు వరాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఒకేసారి మూడు పథకాలను అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. మూడు పథకాలు మహిళల కోసం ప్రత్యేకించి రూపొందించినవే. అట్టడుగున ఉన్న మహిళలను ఆర్థికంగా చేయూతను అందించేందుకు ఈ మూడు పథకాలు మరింత దోహదపడతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
మార్చి 8వ తేదీన...
మార్చి 8వ తేదీన 'మహిళా దినోత్సవం' సందర్భంగా ఏపీ ప్రభుత్వం కొత్త పథకాలను ప్రకటించింది. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం పిల్లల చదువుల కోసం లక్ష రూపాయల వరకు పావలా వడ్డీకే రుణం అందించాలని నిర్ణయించింది. ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి పథకం కింద కుమార్తె పెళ్లికి 48 గంటల్లోనే ఆర్థిక సాయం అందచేయనుంది. ఇక యానిమేటర్లకు 15,000 విలువైన స్మార్ట్ఫోన్లు ఉచితంగా అందచేయనుంది.
Next Story

