Fri Jan 30 2026 07:07:31 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : గుడ్ న్యూస్...ఏపీలో ఉచిత విద్యుత్తు అమలు ఎప్పటి నుంచి అంటే?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 1 నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్ అమలు చేయనున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గానికి 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ఉచిత విద్యుత్తు కారణంగా మొత్తం 1,03,534 కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. మగ్గం వాడే నేతన్నలకు నెలకు రూ.720లు, ఏడాదికి రూ.8,640లు ఆదా అవుతుంది. మరమగ్గం చేనేతలకు నెలకు రూ.1800లు, ఏడాదికి రూ.8,640ల లబ్ది కలుగుతుంది.
ఏడాదికి 85 కోట్ల భారం...
నేతన్నలకు ఉచిత విద్యుత్తు ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఖజానా పై ఏడాదికి 85 కోట్లకు పైగా భారం పడుతుంది. అయితే ముందుగా ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం నేతన్నలకు ఉచిత విద్యుత్తు అందించాలని నిర్ణయించింది. అయితే ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ ఉచిత విద్యుత్తు పథకం అమలు కానుంది. నేతన్నలకు ఆర్థిక భరోసా కల్పనే కూటమి లక్ష్యంగా పనిచేస్తుంది. నేతన్నలకు ఎన్నికల్లో ఇచ్చిన మరో కీలక హామీని నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ ను త్వరలోనే అమలు చేయనుందని మంత్రి సవిత తెలిపారు
ఆర్థిక భరోసా కలిగించేలా...
రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందనడనడానికి ఇది ఉదాహరణ. నేతన్నలకు ఆర్థిక భరోసా కలిగించేలా ఈ నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 50 ఏళ్ల నిండిన నేతన్నలకు నాలువేల రూపాయల పెన్షన్లు అందజేస్తున్నారు. ఇలా రాష్ట్రంలో 87,280 మందికి నేతన్నలకు పెన్షన్లు అందజేస్తున్నారు. రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెన్షన్లు పెంచడం వల్ల నేతన్నకు నెలకు రూ.1000 చొప్పున్న ఏడాదికి రూ.12 వేల మేర ఆర్థిక లబ్ధి కలుగుతోంది. గడిచిన రెండు నెలల్లో ఆప్కో ద్వారా చేనేత సహకార సంఘాలకు రూ.7 కోట్ల మేర బకాయిలు చెల్లించారు. ఈ ఏడాది మొదటి విడత త్రిఫ్ట్ ఫండ్ నిధుల్లో భాగంగా రూ.1.67 కోట్లు మంజూరు చేశారు. ఎన్ హెచ్డీసీ ద్వారా నూలుపై 15 శాతం రాయితీ అందజేశారు. నేతన్నలకు ఇచ్చే ప్రాసెసింగ్ ఛార్జీలు పెంచారు..
ఏడాది పాటు ఉపాధి...
దీంతో పాటు నేతన్నలకు 365 రోజుల పాటు ఉపాధి కల్పనలో భాగంగా కీలక ఒప్పందాలు చేసుకుంటున్నట్లు మంత్రి సవిత తెలిపారు. కో ఆప్టెక్స్, టాటా తనేరియా, బిర్లా ఆద్యం సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామని తెలిపారు. ఆప్కోలో రెడీ మేడ్ దుస్తుల అమ్మకాలతో నేతన్నలకు పెరిగిన ఉపాధి పెరిగిదన్నారు. ఈ కామర్స్ లో ద్వారా చేనేత వస్త్రాలను విక్రయిస్తున్నామన్నారు. విశాఖలో 5 ఎకరాల్లో రూ.172 కోట్లతో యూనిటీ మాల్ నిర్మిస్తున్నామన్నారు. ఎమ్మిగనూరు, రాయదుర్గం, మైలవరం, పామిడిలోనూ టెక్స్ టైల్స్ పార్కులు, మంగళగిరిలో మెగా టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు చేయనున్నామన్నారు. ధర్మవరంలో రూ.30 కోట్లతో మెగా క్లస్టర్ నిర్మిస్తున్నామన్నారు. పిఠాపురంలో మెగా క్లస్టర్ నిర్మాణానికి చర్యలు ప్రారంభించామన్నారు. రాష్ట్రంలో రూ.10.44 కోట్లతో 10 మినీ క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో ఏపీ చేనేత రంగం అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు.
Next Story

