Tue Jan 06 2026 20:01:55 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్... త్వరలో నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది త్వరలో మరొకసారి డీఎస్సీ నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వచ్చే నెలలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముంది. ఖాళీగా ఉన్న దాదాపు 2,500 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు నోటిఫికేషన్ కు సంబంధించిన ప్రక్రియను సిద్ధం చేస్తున్నారు. మంత్రి నారా లోకేశ్ విదేశీ పర్యటన వచ్చిన వెంటనే ఆయన అనుమతి తీసుకుని నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేయాల్సిందన్న దానిపై అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు.
మెగా డీఎస్సీతో ఇప్పటికే...
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీని నిర్వహిస్తామని చెప్పారు. అన్నట్లుగానే ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వెంటనే మెగా డీఎస్సీ ఫైలుపై తొలి సంతకం చేశారు. తర్వాత మెగా డీఎస్సీని పూర్తి చేశారు. దాదాపు 15,941 ఉపాధ్యాయ పోస్టులను ఒక్కసారిగా భర్తీ చేసి రికార్డు సృష్టించారు. విద్య విషయంలో అశ్రద్ధ చేయకుండా వెంటవెంటనే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని, అలాగే ప్రతి ఏటా డీఎస్సీని నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నిరుద్యోగులకు హామీ ఇచ్చారు.
వచ్చే నెలలో మరొక నోటిఫికేషన్...
నారా లోకేశ్ హామీ ఇచ్చినట్లుగానే వచ్చే నెలలో 2,500 పోస్టులు భర్తీ చేయడానికి దాదాపు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ అందింది. అయితే కొత్తగా నిర్వహించే డీఎస్సీలో మాత్రం ఇంగ్లీష్ లో మంచి ప్రావీణ్యంతో పాటు కంప్యూటర్ పై అవగాహన ఉండేలా ఒక పరీక్ష నిర్వహించాలని విద్యాశాఖ ఆలోచనలో ఉందని తెలిసింది. విద్యార్థులకు ఆంగ్ల భాషపై పట్టుతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం అందించేలా ఉపాధ్యాయుల ఎంపిక జరగాలని నారా లోకేశ్ కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో లోకేశ్ ఓకే చెప్పిన వెంటనే వచ్చే నెలలో దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో పాటు పదవీ విరమణ చేసే ఉపాధ్యాయుల స్థానంలో వెంటనే ఖాళీలను భర్తీ చేసేలా నిర్ణయం తీసుకోనుందని తెలిసింది.
Next Story

