Tue Jan 13 2026 08:57:51 GMT+0000 (Coordinated Universal Time)
సంక్రాంతి వేళ రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది

సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తుంది. ఈ నెల 19వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగాఉచిత పశు ఆరోగ్య శిబిరాలు* నిర్వహించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ & పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు తెలిపారు.
ఉచిత పశువైద్య శిబిరాలు...
రాష్ట్రంలో 25 లక్షల కుటుంబాలు పశువుల పెంపకపై ఆధారపడి ఉన్నాయి. 108.19 లక్షల ఆవులు మరియు గేదెలున్నాయి, 231.49 లక్షల గొర్రెలు మరియు మేకలున్నాయి. 1078.63 లక్షల కోళ్లను పెంచుతున్నారు. ప్రభుత్వం నిర్వహించే ఉచిత వైద్య శిబిరాల్లో పశువైద్య చికిత్సలు, గర్భకోశ వ్యాధులకు చికిత్స, నట్టల నివారణ మందుల పంపిణీ, గొర్రెలు/మేకలకు –సంవత్సరానికి 4 సార్లు,పెద్ద పశువులకు రెండు సార్లు వ్యాధి నిరోధక టీకాలు, వ్యాధుల నిర్ధారణ పరీక్షలు, శాస్త్రీయ పశుపోషణపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు.
Next Story

