Tue Feb 10 2026 14:23:47 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : మైనారిటీ విద్యార్థులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
మైనారిటీ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది

మైనారిటీ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో నీట్, ఈఏపీ సెట్ పరీక్షలకు హాజరయ్యే మైనారిటీ విద్యార్థుల కోసం ఉచిత శిక్షణ ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. మైనారిటీ సంక్షేమ శాఖ నేతృత్వంలో, సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ ద్వారా మైనారిటీ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. నీట్, ఈఏపీ సెట్ ల పోటీ పరీక్షల్లో ఉన్నతమైన మార్కులను సాధించి, మంచిర్యాంకులతో వైద్య, ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మా తదితర అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో అడ్మిషన్ పొందేందుకు వీలుగా మైనారిటీ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వబోతున్నట్లు తెలిపారు.
పూర్తి వివరాలకు...
ఉచిత శిక్షణను ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానాలలో 45 రోజుల పాటు అందించడం జరుగుతుందన్నారు.నీట్, ఈఏపీ సెట్ ల శిక్షణలో నిష్ణాతులైన అధ్యాపకుల చేత బోధనా తరగతులు నిర్వహించడం జరుగుతుందని మంత్రి ఫరూక్ తెలిపారు. ఈ అవకాశాన్ని మైనారిటీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు సీఈడీఎం వెబ్ సైట్: www.apcedmmwd.org లేదా విజయవాడ సీఈడీఎం కేంద్ర కార్యాలయం లో సంప్రదించాలన్నారు. అలాగే [email protected], ఫోన్ నెంబర్: 0866-2970567,మొబైల్ నెంబర్: 73867 89966 సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని మైనారిటీ మంత్రి ఫరూక్ తెలిపారు.
Next Story

