Sat Mar 07 2026 05:30:53 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : నేడు ఆసుపత్రులకు ఐదు వందల కోట్లు విడుదల
ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య శ్రీ పథకాన్ని నిలిపేస్తున్నట్లు ఆసుపత్రులు ప్రకటించడంతో ప్రభుత్వం అప్రమత్తమయింది

ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య శ్రీ పథకాన్ని నిలిపేస్తున్నట్లు ఆసుపత్రులు ప్రకటించడంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. ఏపీ నెట్వర్క్ ఆసుపత్రులకు 500 కోట్ల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడు వేల కోట్ల రూపాయలు బకాయీ ఉన్నాయంటూ ఆసుపత్రులో ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేసిన నేపథ్యంలో ప్రభుత్వం వారితో చర్చలు ప్రారంభించింది.
నేడు సమావేశం
ఈరోజు నెట్వర్క్ ఆస్పత్రులతో వైద్య ఆరోగ్యశాఖ అధికారుల సమావేశం జరగనుంది. వచ్చే ఏప్రిల్ 1వ తేదీ నుంచి బీమా పద్ధతిలో ఎన్టీఆర్ వైద్య సేవలు అందుతున్న సమయంలో ఆస్పత్రుల బకాయిలు ఇవ్వాలని నెట్వర్క్ ఆస్పత్రుల ఒత్తిడి తేవడంతో ప్రస్తుతం 00 కోట్లు ఇస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. మరి ఆసుపత్రుల యాజమాన్యాలు ఎలా స్పందిస్తాయన్నది చూడాలి.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

