Thu Mar 05 2026 11:16:43 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. దివ్యాంగులతో పాటు వారికి కూడా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 18వ తేదీ నుంచి దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయనుంది. దీనికి ఇంధ్ర ధనస్సుగా నామకరణం చేశారు. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలోనే మాట ఇచ్చారు. ఆ మాట మేరకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దిశగా కూటమి ప్రభుత్వం పనిచే్స్తుంది. ఇంధ్ర ధనస్సు పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 18వ తేదీన అధికారికంంగా ప్రారంభంచనున్నారు.
కొన్ని నిబంధనలతో...
ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. కూటమి ప్రభుత్వం అములులోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని మహిళలకు స్త్రీ శక్తి పథకం కింద ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించింది. అయితే దివ్యాంగులకు కూడా ఉచిత ప్రయాణాన్ని కల్పించాలని ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలు ఈ నెల 18వ తేదీ నుంచి అమలు కానున్నాయి. అయితే ఇందులో కొన్ని నిబంధనలను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇంధ్రధనస్సు పథకం కింద దీనిని పద్దెనిమిదో తేదీన అమలు చేయనున్నారు.
నలభై శాతం ఉంటేనే...
అయితే ప్రభుత్వ నిబంధనల మేరకు దివ్యాంగులకు ఖచ్చితంగా 40 శాతం వైకల్యం సర్టిఫికెట్ ఉంటేనే ఉచిత బస్సు ప్రయాణం లభిస్తుంది. నలభై శాతం ఆ పైన ఉండే వారికి మాత్రమే ఉచిత బస్సు ప్రయాణానికి అనుమతిస్తారు. అలాగే వీరికి సహాయకారిగా వచ్చే వారిలో ఒకరికి యాభై శాతం ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో రాయితీని కూడా కల్పించనున్నారు. ఇంధ్ర ధనస్సు పథకం అమలు ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని లక్షలాది మంది దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు.
Next Story

