Wed Jan 07 2026 17:30:37 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : బీసీ యువతకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..లక్షలు చెల్లించాల్సిన పనిలేదిక
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ యువతకు గుడ్ న్యూస్ చెప్పింది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ యువతకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరో మరో మూడు చోట్ల బీసీ ఐఎఎస్ స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సవిత ప్రకటించారు. దీంతో పాటు రాజధాని అమరావతిలో ఐదు ఎకరాల్లో బీసీ స్టడీ సర్కిల్ నిర్మాణం జరపనుంది. బీసీ యువత ఉన్నత స్థానాల్లో ఉండాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. బీసీ ఐఏఎస్ స్టడీ సర్కిళ్ల ద్వారా సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందజేయనున్నారు. విద్యా బోధన, వసతి సౌకర్యాలను కల్పించనున్నారు. బీసీలు ఉన్నత స్థానానికి చేరుకునేలా ఈ స్టడీ సర్కిళ్లు పనిచేయనున్నాయి. సివిల్ పరీక్షలకు ప్రిపేర్ కావాలంటే లక్షల రూపాయలు ప్రయివేటు కోచింగ్ సెంటర్లకు చెల్లించాల్సి ఉంటుంది.
సివిల్స్ కోచింగ్ కు...
కానీ అంత మొత్తం చెల్లించలేని, సివిల్స్ పరీక్షల్లో నెగ్గి ఐఏఎస్, ఐపీఎస్ లు కావాలనుకునే బీసీ యువతకు ఈ స్టడీ సర్కిళ్లు బాగా పనిచేస్తాయని అధికారులు చచెబుతున్నారు. నిరుద్యోగ బీసీ అభ్యర్థులకు ఉచిత సివిల్ సర్వీసెస్, డీఎస్సీ వంటి పోటీ పరీక్షలు ఉచిత శిక్షణ అందజేయడానికి ఈ స్టడీ సర్కిల్స్ పనిచేయనుననాయి. గతేడాది మంది అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత సివిల్స్ కోచింగ్ అందజేశారు. మెగా డీఎస్సీని దృష్టిలో పెట్టుకుని, సుమారు అయిదు వేల మందికి శిక్షణ అందివ్వగా, వారిలో 281 మంది టీచర్ పోస్టులు సాధించారు. ఈ ఏడాది కూడా ఉచిత సివిల్స్ కోచింగ్ ప్రారంభించనున్నారు. ఇందులో వంద మంది అభ్యర్థులకు నాణ్యమైన ఆహారం, వసతులతో కూడిన విద్య అందిస్తున్నారు.
మరో మూడు సెంటర్లు...
ప్రభుత్వం అందిస్తున్న ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని, బీసీ అభ్యర్థులు సివిల్స్ పోటీ పరీక్షల్లో సత్తా చాటాలని మంత్రి సవిత ఆకాంక్షించారు. రాష్ట్రంలో కొత్తగా మరో మూడు చోట్ల బీసీ స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేసి, సివిల్ సర్వీసెస్ లో ఉచిత కోచింగ్ అందివ్వనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. అమరావతిలో అయిదు ఎకరాల్లో రాష్ట్ర స్థాయి బీసీ స్టడీ సర్కిల్ నిర్మించనున్నామన్నారు. ఢిల్లీకి వెళ్లి లక్షలు వెచ్చించి సివిల్స్ కోచింగ్ తీసుకున్నప్పటికీ ఇటువంటి సౌకర్యాలు, వసతి దొరకవు. ఆయా సబ్జెక్టుల్లో నిష్ణాతులతో బోధన, ప్రోటీన్ తో కూడిన ఆహారం అందిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది.
Next Story

