Tue Mar 17 2026 13:20:36 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : రంజాన్ సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముస్లిం సోదరులకు రంజాన్ సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పింది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముస్లిం సోదరులకు రంజాన్ సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని ఇమామ్, మౌజన్లకు రంజాన్ సందర్భంగా శుభవార్త తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఇమామ్, మౌజన్ల గౌరవ వేతనం నిమిత్తం రూ.45 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. గత ఆరు నెలల బకాయిలను రంజాన్ సందర్భంగా ఒకేసారి కూటమి ప్రభుత్వం క్లియర్ చేసింది.
ఇమామ్, మౌజన్లకు...
నిన్న ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చిన కొన్ని గంటల్లోనే నిధుల విడుదలకు ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా 10,000 మంది ఇమామ్లు, మౌజన్ల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేయనున్నారు. 5,000 మంది ఇమామ్లకు ఆరు నెలల వేతనం కింద రూ.30 కోట్ల చెల్లింపులను జరపనున్నారు. ఐదు వేల మంది మౌజన్లకు ఆరు నెలల వేతనం కింద రూ.15 కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేయనుంది.
Next Story

