Fri Jan 30 2026 03:18:37 GMT+0000 (Coordinated Universal Time)
అంబానీ .. జగన్ ఆత్మీయ ఆలింగనం
ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ అట్టహాసంగా ప్రారంభమయింది. అంబానీ జ్యోతిప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు

ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ అట్టహాసంగా ప్రారంభమయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ముఖేష్ అంబానీ జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రేజర్ షో ను తొలుత ఏర్పాటు చేశారు. సమావేశానికి వచ్చిన ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి ఎదురు వచ్చి ముఖ్యమంత్రి జగన్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.
90 శాతం ఎంవోయూలు...
గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ కు ముఖేష్ అంబానీతో పాటు కరణ్ అదానీ, సంజీవ్ బజాజ్, జీఎంరావు, సజ్జన్ జిందాల్ వంటి పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. 90 శాతం అవగాహన ఒప్పందాలు కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వ అధకారులు చెబుతున్నారు. వెంటనే పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులతో పాటు భూముల కేటాయింపు జరపాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. రెండు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకట్టుకునే విధంగా రెండు రోజుల పాటు ఈ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు జరగనుంది.
Next Story

