Sat Mar 21 2026 19:19:42 GMT+0530 (India Standard Time)
నిరుద్యోగులకు మంత్రి ఆనం గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు.త్వరలో దేవాదాయ శాఖలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. దేవాదాయశాఖ పరిధిలోని అన్ని ఆలయాల పరిపాలన విభాగాల్లో ఖాళీలను, అర్చక విభాగంలో ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు.
ఐదు వందల పోస్టుల వరకూ...
మొత్తం త్వరలో 500 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. దీంతో పాటు అన్ని ఆలయాల్లో ట్రస్ట్ బోర్డుల నియామకాలు చేపడతామని తెలిపారు. ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. దీంతో పెద్దయెత్తున ఉద్యోగాలు ఈ శాఖలో భరతీ చేసినట్లు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Next Story

