Thu Mar 19 2026 05:27:16 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ వాసులకు సూపర్ న్యూస్ గురూ
ఆంధ్రప్రదేశ్ లో నేడు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది

ఆంధ్రప్రదేశ్ లో నేడు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆదివారం రాత్రి ఏపీలోని నలభై మూడు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 125.7మిమీ, నంద్యాల జిల్లా పాణ్యంలో 113.2మిమీ, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 106.2మిమీ వర్షపాతం నమోదయిందని తెలిపారు.
నేడు మోస్తరు వర్షాలు..
ఆంధ్రప్రదేశ్ లోని రెండు వందల ఐదు ప్రాంతాల్లో కురిసిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈరోజు ఆంధప్రదేశ్ లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
Next Story

