Tue Jan 20 2026 19:06:09 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : వారాహి అమ్మవారి దీక్షకు దిగనున్న పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రేపటి నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రేపటి నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు. ఆయన బుధవారం నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు. పవన్ కల్యాణ్ ప్రతి ఏటా వారాహి అమ్మవారి దీక్షలను చేపడతారు. మొత్తం పదకొండు రోజుల పాటు నియమ నిష్టలతో పూజలు చేస్తూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు.
పదకొండు రోజులు...
పదకొండు రోజుల పాటు ఎలాంటి ఆహారం తీసుకోరు. కేవలం ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. పండ్లు ఆహారంగా పుచ్చుకుంటారు. చాలా ఏళ్ల నుంచి పవన్ కల్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేస్తున్నారు. ప్రతి ఏడాది జూన్ లో ఈ దీక్ష చేపట్టడం ఆయన అలవాటుగా మార్చుకున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా బిజీగా ఉండి కూడా వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు. గత ఏడాది ఇదే సమయంలో వారాహి విజయయాత్ర చేపట్టి మొన్నటి ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొందారు.
Next Story

