Fri Mar 20 2026 15:42:03 GMT+0530 (India Standard Time)
పవన్ సెక్యూరిటీలో లోపం.. ఐపీఎస్ అధికారిగా?
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పర్యటనలో నకిలీ పోలీసు ప్రవేశించడం కలకలం రేపింది

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పర్యటనలో నకిలీ పోలీసు ప్రవేశించడం కలకలం రేపింది. ఆ నకిలీ అధికారి పర్యటన ఆసాంతం పవన్ కళ్యాణ్ వెంటే ఉండటం సంచలనం కలిగించింది. దీనిపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఆ నకిలీ ఐపీఎస్ అధికారి భద్రతా సిబ్బందితో ఫోటోలకూ ఫోజులిచ్చారు. వై కేటగిరీ భద్రతలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భధ్రతా వైఫల్యంపై హోం మంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలానికి పర్యటనకు పవన్ కళ్యాణ్ వచ్చిన సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

మన్యం జిల్లాలో...
పవన్ కళ్యాణ్ వచ్చిన సమయంలో ఆయన వెన్నంటే ఉండి ఐ.పి.ఏస్ ఆఫీసర్ లా ఆ వ్యక్తి కలియ తిరిగాడు. పర్యటన అనంతరం కింది స్థాయి సిబ్బందితో ఫోటోలు దిగాడు. పర్యటన తర్వాత ఫోటోలు బయటకు రావడంతో మన్యం జిల్లా పోలీసులు విచారణ చేశారు. నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ అని తేలడంతో నిన్న రాత్రి అదుపులోకి విజయనగరం రూరల్ పోలీసులు తీసుకుని విచారిస్తున్నారు. అతను గరివిడి మండలానికి చెందిన బలివాడ సూర్య ప్రకాష్ అనే వ్యక్తిగా గుర్తించారు.అతను ఎందుకు అలా వచ్చాడన్న దానిపై విచారణ చేస్తున్నారు.
Next Story

