Sun Mar 15 2026 10:21:45 GMT+0530 (India Standard Time)
Pawan Kalyan : అమిత్ షాతో పవన్ ఏం మాట్లాడారంటే?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ ముగిసింది.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ ముగిసింది. పదిహేను నిమిషాలు మాత్రమే అమిత్ షాతో పవన్ సమావేశమయ్యారు. అయితే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అంశాలపై పవన్ తో అమిత్ షా చర్చించినట్లు తెలిసింది. మహారాష్ట్రలో తెలుగు వారు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ పర్యటించేందుకు అవసరమైన ఏర్పాట్ల కోసం చర్చించడానికి అమిత్ షా పవన్ ను ప్రత్యేకంగా పిలిపించుకున్నట్లు తెలిసింది.
రాష్ట్ర రాజకీయ పరిణామాలపై...
మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయాలని, అందుకు అనువైన తేదీలను చెప్పాలని అమిత్ షా పవన్ ను కోరినట్లు సమాచారం. పవన్ కూడా అందుకు అంగీకరించినట్లు తెలిసింది. దీంతో పాటు రాష్ట్రంలో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల విషయంపై అమిత్ షాకు పవన్ కల్యాణ్ బ్రీఫ్ చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం తాము చేస్తున్న కృషిని కూడా పవన్ ఈ సందర్భంగా అమిత్ షాకు తెలియజేసినట్లు తెలిసింది.
Next Story

