Fri Dec 05 2025 18:23:29 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : నేడు పిఠాపురానికి పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఆయన రెండు రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంటారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పవన్ కల్యాణ్ పాల్గొననున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధిపై అధికారులతో సమీక్షను నిర్వహిస్తారు.
రెండు రోజుల పాటు...
ఈ నెల 4,5 తేదీలలో పవన్ కల్యాణ్ పర్యటన ఉండటంతో కార్యకర్తలు భారీగా ఏర్పాట్లు చేశారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ప్రత్యేకంగా జనసేన కార్యకర్తలు సిద్ధమయ్యారు. రెండు రోజుల్లో కేవలం అధికారులతో మాత్రమే కాకుండా పార్టీ నేతలతో కూడా పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. పార్టీ బలోపేతంపై దృష్టిసారించనున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా కూటమి పార్టీల మధ్య నెలకొన్న విభేదాలను కూడా ఈ సమావేశంలో ప్రస్తావించే అవకాశముంది.
Next Story

