Sun Mar 15 2026 16:35:34 GMT+0530 (India Standard Time)
Pawan Kalyan : నేటి నుంచి పిఠాపురంలో పవన్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేటి నుంచి పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేటి నుంచి పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారి పవన్ పిఠాపురం వస్తుండటంతో భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు సన్నాహాలు చేశారు. ఉదయం రాజమండ్రి ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా పవన్ పిఠాపురం వెళ్లనున్నారు. ఉదయం పది గంటలకు పింఛను పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో జరిగే పింఛను పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మూడు రోజుల పాటు...
అనంతరం మధ్యాహ్నం చేబ్రోలు నివాసంలో పిఠాపురం జనసేన నేతలతో పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. మూడు రోజుల పాటు పవన్ కల్యాణ్ పిఠాపురంలోనే ఉంటారు. రేపు ఉదయం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ పంచాయతీ, అటవీ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమవుతారు. జులై 3వ తేదీన ఉప్పాడ, యు.కొత్తపల్లిలో పర్యటిస్తారు. అనంతరం టీడీపీ, బీజేపీనేతలతోనూ పవన్ భేటీ అవుతారు. సాయంత్రం నాలుగు గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story

