Tue Mar 24 2026 03:20:09 GMT+0530 (India Standard Time)
Pawan Kalayan : నేడు ప్రధాని మోదీతో పవన్ భేటీ
ప్రధాని నరేంద్ర మోదీతో నేడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీతో నేడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. ఉదయం పదకొండున్నర గంటలకు పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు, విభజన అంశాలు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ప్రాజెక్టుపై ప్రధానితో పవన్ కల్యాణ్ చర్చించనున్నారు. పవన్ కల్యాణ్ మూడు రోజుల నుంచి ఢిల్లీలోనే ఉన్నారు. వివిధ కేంద్ర మంత్రులను కలసి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలపై చర్చిస్తున్నారు.
అదానీతో ఒప్పందాలను...
దీంతో పాటు జలజీవన్ మిషన్ స్కీమ్ లో భాగంగా ఏపీకి రావాల్సిన నిధులను విడుదల చేయాలని ప్రధానిని పవన్ కోరనున్నారు. ఏపీలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షితమైన మంచినీటిని అందిస్తామని ఇచ్చిన ఎన్నికల హామీని అమలు చేసేందుకు సహకరించాలని కోరనున్నారు. దీంతో పాటు మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయం సాధించడం పై అభినందించనున్న పవన్ ఏపీలో అదానీ తో ఒప్పందాలపై కూడా చర్చించే అవకాశాలున్నాయని తెలిసింది.
Next Story

