Thu Mar 19 2026 11:57:05 GMT+0530 (India Standard Time)
13న శ్రీహరి కోటకు పవన్ కల్యాణ్
ఈనెల 13న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ శ్రీహరి కోటకు రానున్నారు

ఈనెల 13న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ శ్రీహరి కోటకు రానున్నారు. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీహరికోట షార్ కు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇస్రో ఆధ్వర్యంలో గత నెల 14 నుంచి ఈ నెల 15 వరకు జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు.ఇప్పటికే ఈ వేడుకలు ఒడిశా, పుదుచ్చేరి, తమిళనాడు, గుంటూరులలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలకు...
ఈనెల 13న శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రంలో జరిగే కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అక్కడ జరిగే కార్యక్రమాల్లో పవన్ పాల్గొంటారని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
Next Story

