Fri Dec 05 2025 12:41:48 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : నేడు కాకినాడకు పవన్
ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాకినాడకు రానున్నారు.

ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాకినాడకు రానున్నారు. అయితే కాకినాడలో పలు చోట్ల ఆయన తనిఖీలు చేయనున్నారని చెబుతున్నారు. కాకినాడ పోర్టుతో పాటు అనేక ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ తనిఖీ చేస్తారని తెలిసింది. కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం ఇతర దేశాలకు, ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో పవన్ కల్యాణ్ తనిఖీలు చేయనున్నారు.
రేషన్ బియ్యం ...
ప్రధానంగా గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై ఇలాంటి ఆరోపణలు అనేకం వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ కాకినాడ పర్యటనకు వస్తున్నట్లు సమాచారం. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో పవన్ కల్యాణ్ సమీక్షలకు దూరంగా ఉండనున్నారు. రెండు రోజుల క్రితమే కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం పట్టుకున్నారు. దీంతో పవన్ కల్యాణ్ పర్యటన ఆసక్తికరంగా మారింది.
Next Story

