Wed Mar 18 2026 22:06:09 GMT+0530 (India Standard Time)
Pawan Kalyan : నేడు కూడా కాకినాడ జిల్లాలోనే పవన్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు కూడా కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు కూడా కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. మూడోరోజు ఆయన పర్యటన కొనసాగుతుంది. ఈరోజు కూడా పలు కార్యక్రమాల్లో పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. ఆయన ఈరోజు ఉప్పాడ తీరాన్ని పరిశీలించనున్నారు. సముద్రం ముందుకు వస్తుండటంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.
మత్స్యకారులతో...
దీంతో ఉప్పాడ తీరాన్ని పరిశీలించిన అనంతరం పవన్ కల్యాణ్ మత్స్యకారులతో భేటీ అవుతారు. వారి సమస్యలను గురించి అడిగి తెలుసుకుంటారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఈరోజు కూడా జనసేన నేతలు, కార్యకర్తలతో పవన్ కల్యాణ్ సమావేశమవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. పిఠాపురంలో తనను గెలిపించినందుకు కృతజ్ఞత తెలపనున్నారు.
Next Story

