Fri Mar 20 2026 13:10:29 GMT+0530 (India Standard Time)
Pawan Kalyan : వైసీపీ నేతలకు పవన్ మాస్ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కడప లో పర్యటించారు. ఎంపీడీవో జవహర్ బాబును కడప రిమ్స్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కడప లో పర్యటించారు. ఎంపీడీవో జవహర్ బాబును కడప రిమ్స్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో దాడి ఎలా జరిగిందన్న దానిపై పవన్ కల్యాణ్ ఆరా తీశారు. అధికారులపై దాడులకు దిగితే సహించబోమని వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. పదకొండు స్థానాలకే పరిమితమైనా ఇంకా దిగి రాలేదన్నారు.

రిమ్స్ లో పరామర్శించి...
ఎంపిడిఓ అంటే ఒక మండలానికి ఉన్నత అధికారి అని, అలాంటి వ్యక్తిని బూతులు తిడుతూ కులం పేరు మీద దూషిస్తూ ఇదొక పరిపాటి అయిపోయిందన్నారు. వైసీపీ నేతలకు ముఖ్యంగా రాయలసీమలో ఎక్కడైతే ఇలాంటి ఆదిపత్యపు ధోరణి ఉందో అక్కడ అందరూ సమిష్టిగా ఎదురు తిరగాలని కోరుకుంటున్నానని పవన్ కల్యాణ్ కడప రిమ్స్ ఆసుపత్రిలో గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

