Fri Dec 05 2025 14:13:55 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : పహాల్గాం దాడిపై పవన్ సంచలన వ్యాఖ్యలు.. ఆ కుటుంబానికి యాభై లక్షల విరాళం
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు కొందరికి పాక్ అంటే వల్లమాలిన ప్రేమ అని అన్న ఆయన అంత ప్రేమ పాకిస్థాన్ పై ఉంటే అక్కడకే వెళ్లిపోవాలంటూ పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. పహల్గాంలో పర్యాటకులపై జరిగిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. భారత దేశంలో ఉంటూ పొరుగుదేశంపై ఈ ప్రేమలను ఒలకపోయడమేంటని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఈ ఘటన యావత్ భారత్ దేశంలోనే కాకుండా ప్రపంచాన్ని కూడా దిగ్భ్రాంతికి గురి చేసింని పవన్ అన్నారు.
దేశం విడిచి వెళ్లిపోవాలంటూ...
కానీ కొందరు రాజకీయ పార్టీ నేతలు ఈ దాడిని రాజకీయంగా మలచుకునే ప్రయత్నం చేయడం విచారకరమన్న పవన్ కల్యాణ్ అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదులపై చర్యలు తీసుకోకుంటే ఇక దేశంలో పార్టీలు ఉండి ఎందుకని ప్రశ్నించారు. అందుకే కేంద్ర ప్రభుత్వం దాడి తర్వాత అన్ని చర్యలు తీసుకుంటుందని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రతి ఒక్క భారతీయుడు ఈ దాడిని ఖండించాలన్న పవన్ కల్యాణ్, ఇటువంటి సమయాల్లో అందరం కలసి కట్టుగా నిలబడి ఐక్యత ప్రదర్శించాలని పవన్ ఆకాంక్షించారు. సోమిశెట్టి మధుసూదన్ కుటుంబానికి జనసేన తరుపున యాభై లక్షల రూపాయల విరాళం ప్రకటించారు.
Next Story

