Sun Dec 14 2025 03:59:52 GMT+0000 (Coordinated Universal Time)
కుంకీ ఏనుగుల కోసం బెంగళూరుకు పవన్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బెంగళూరు బయలుదేరి వెళ్లారు.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బెంగళూరు బయలుదేరి వెళ్లారు. కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి. ఖంద్రే తో చర్చలు పవన్ చర్చలు జరపనున్నారు. చిత్తూరు జిల్లా పరిధిలోను, పార్వతీపురం ప్రాంతంలోను ఏనుగులు ఊళ్ళ మీదకు వచ్చి పంటలు నాశనం చేస్తుండటంతో కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేందుకు బెంగళూరు వెళ్లారు.
ఏనుగులను తరమడానికి...
ఊరి మీద పడుతున్న ఏనుగులు ప్రాణ హాని కలిగిస్తున్నాయని వాటిని అడవుల్లోకి తరిమేసేందుకు చర్చలు జరుపుతున్నారు. ఇలా వచ్చే ఏనుగులను తిరిగి అడవిలోకి తరిమేందుకు కుంకీ ఏనుగులు అవసరమవుతాయి. కుంకీ ఏనుగులు కర్ణాటక దగ్గర ఉండటంతో వాటిలో కొన్ని ఏనుగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చేలా కర్ణాటక అటవీ శాఖను కోరడం ఈ రోజు చర్చల్లో ప్రధాన అంశంగా ఉండనుంది.
Next Story

