Thu Mar 19 2026 01:08:27 GMT+0530 (India Standard Time)
పవన్ కల్యాణ్ కు వైరల్ ఫీవర్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. ఆయన కొద్ది రోజుల నుంచి వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వైరల్ ఫీవర్ తో బాధపడుతూనే ఆయన వరద సమీక్షల్లో పాల్గొంటున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై రోజూ రివ్యూ చేస్తున్నారు.
అయినా సమీక్షలు చేస్తూ...
ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలతో పాటు ప్రకాశం బ్యారేజీ నుంచి నీరు పన్నెండు లక్షల క్యూసెక్కుల నీరును విడుదల చేయడం, బుడమేరు పొంగడంతో తీవ్రమైన నష్టం వాటిల్లింది. ఎందరో నిరాశ్రయులయ్యారు. దీంతో పవన్ కల్యాణ్ ఫీల్డ్ లెవెల్ లో పర్యటించకుండా కార్యాలయం నుంచి సమీక్షలు చేస్తు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. గోదావరి నదికి కూడా వరద పెరుగుతుండటంతో పవన్ కల్యాణ్ జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేశారు.
Next Story

