Thu Dec 18 2025 23:02:13 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : అనాధ పిల్లలకు పవన్ గుడ్ న్యూస్.. వారికి నెలకు
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురంలోని అనాథ పిల్లలకు పవన్ వేతనం అందించనున్నారు. ఒక్కొక్క చిన్నారికీ ఐదు వేల రూపాయల చొప్పున సాయం చేయనున్నారు. ప్రతి నెలా ఇంటి దగ్గరే అందించేలా ప్రణాళిక చేస్తున్నారు. పదవిలో ఉన్నంతకాలం ప్రక్రియ కొనసాగుతుందని పవన్ తెలిపారు.
ఆలయాల్లో పూజలు...
మరొక వైపు జనసేన శ్రేణులకు పవన్‌కల్యాణ్ కీలక సూచనలు చేశారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ధర్మయుద్ధానికి ఆధ్యాత్మిక మద్దతు ఇవ్వాలన్న పవన్వచ్చే మంగళవారం షణ్ముఖ క్షేత్రాల్లో పూజలు చేయాలని పిలుపు నిచ్చారు. ప్రతి క్షేత్రానికి ఎమ్మెల్యేతో పాటు జనసేన కార్యకర్తలు వెళ్లాలని చెప్పారు. కర్ణాటకతో పాటు మోపిదేవి, బిక్కవోలులోని సుబ్రహ్మణ్య ఆలయాల్లో పూజలు చేయాలన్న పవన్ ఇంద్రకీలాద్రి, పిఠాపురం, అరసవల్లిలో సైన్యానికి మద్దతుగా పూజలు చేయించాలని, చర్చిలు, మసీదుల్లో ప్రార్థనలు చేపట్టాలని పవన్ కల్యాణ్ సూచించారు.
Next Story

