Tue Mar 17 2026 22:04:25 GMT+0530 (India Standard Time)
Pawan Kalyan : హైకోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు బిగ్ రిలీఫ్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు హైకోర్టులో ఊరట లభించింది

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు హైకోర్టులో ఊరట లభించింది. గతంలో గుంటూరులో ఆయనపై నమోదయిన కేసును క్వాష్ చేయాలని పవన్ కల్యాణ్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపై విచారించిన హైకోర్టు కేసులపై స్టే ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరులో వాలంటీర్లపై పవన్ కల్యాణ్ ఎన్నికలకు ముందు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై కేసులు నమోదయ్యాయి.
క్వాష్ చేయాలంటూ...
అయితే తనపై నమోదయిన కేసులను కొట్టివేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం పవన్ పిటీషన్ పై విచారించిన హైకోర్టు ధర్మాసనం కేసు విచారణపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకూ స్టే కొనసాగుతుందని తెలిపింది. ఈ కేసు విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.
Next Story

