Fri Dec 05 2025 14:55:54 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : అధికారులపై పవన్ సీరియస్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాఖపరమైన విచారణ జరపకుండా ఉద్యోగులను ఇబ్బంది పెట్టడమేంటని ఆయన ప్రశ్నించారు. దీని వల్ల కొందరు పదవీ విరమణ చేసినా ప్రయోజనం పొందలేకపోతున్నారని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. మూడు రోజుల్లో తనకు నివేదిక పెండింగ్ కేసులపై ఇవ్వాలని కోరారు.
ఏళ్ల తరబడి పెండింగ్ లో...
ఏళ్ల తరబడి కేసులు పెండింగ్లో ఉంచడంపై పవన్ అధికారులపై మండిపడ్డారు. ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి? వాటి వివరాలు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఉద్యోగుల పనితీరుపై విజిలెన్స్ ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కోరారు. విజిలెన్స్, ఏసీబీ శాఖపరమైన విచారణలు వేగవంతం చేయాలని, సత్వరమే విచారణ పూర్తి చేసి అందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
Next Story

