Wed Jan 28 2026 21:04:33 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : బాలయ్యకు పవన్ అభినందన
నందమూరి బాలకృష్ణకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు

నందమూరి బాలకృష్ణకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్న బాలయ్యను పవన్ అభినందించారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. నందమూరి బాలకృష్ణకు అరుదైన అవార్డు దక్కడం పట్ల పవన్ కల్యాణ్ సంతోషం వ్యక్తం చేస్తూ ఈ ట్వీట్ చేశారు.
ట్వీట్ ఇదే
"బాలనటుడిగా తెలుగు చలన చిత్ర రంగంలోకి స్వర్గీయ నందమూరి తారక రామారావు నట వారసుడిగా అడుగుపెట్టి జానపదాలు, కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ, నట జీవితంలో 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకున్న తరుణంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ( లండన్) లో చోటు సాధించిన ప్రముఖ నటులు, హిందూపురం ఎమ్మెల్యే పద్మ భూషణ్ నందమూరి బాలకృష్ణకు మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన మరిన్ని సంవత్సరాలు తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ, ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను." అని పవన్ కల్యాణ్ ట్వీట్ లో పేర్కొన్నారు.
Next Story

