Sat Mar 07 2026 15:14:37 GMT+0530 (India Standard Time)
Pawan Kalyan : సీఎం సహాయ నిధికి పవన్ కోటి విరాళం
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వరద బాధితులకు కోటి రూపాయల విరాళం ప్రకటించారు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వరద బాధితులకు కోటి రూపాయల విరాళం ప్రకటించారు. తన వంతుగా ఈ విరాళాన్ని ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ విరాళాన్ని ఇస్తున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. అమరావతిలోని కమాండ్ కంట్రోల్ రూంలో పవన్ కల్యాణ్ వరద పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉన్న ఫొటో ఎగ్జిబిషన్ ను పరిశీలించారు.
అధికారులపై ప్రశంసలు...
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని పవన్ కల్యాణ్ తెలిపారు. తక్కువ సమయంలో అధికారులు బాగా పనిచేయగలిగారని ప్రశంసించారు. ఇలాంటి క్లిష్ట సమయంలో మరొకరిని నిందించి ప్రయోజనం లేదన్నారు. గత పాలకుల వైఫల్యం కారణంగా వరద ముప్పు సంభవించిందని ఆయన, భవిష్యత్ లో ఇలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తమ ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు.
Next Story

