Thu Mar 19 2026 20:34:11 GMT+0530 (India Standard Time)
ఏపీని ఊపేస్తున్న కరోనా
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు ఈరోజు భారీగా పెరిగాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 4,108 కొత్త కేసులు నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు ఈరోజు భారీగా పెరిగాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 4,108 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 21,10,388 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,509 మంది మరణించారు.
యాక్టివ్ కేసులు....
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 20,65,696 గా ఉంది. 30,182 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,18,84,914 నమూనాలను పరీక్షించారు.
Next Story

