Thu Mar 19 2026 18:59:55 GMT+0530 (India Standard Time)
ఏపీలో కరోనా కలకలం.... ఒక్కరోజే ఇన్ని కేసులా?
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు ఈరోజు భారీగా పెరిగాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 12,615 కొత్త కేసులు నమోదయ్యాయి

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు ఈరోజు భారీగా పెరిగాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 12,615 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ఐదుగురు మరణించారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 21,40,056 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,527 మంది మరణించారు.
యాక్టివ్ కేసులు....
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 20,71,658 గా ఉంది. 53,871 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,20,12,102 నమూనాలను పరీక్షించారు. ఈరోజు చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 2,358 కేసులు నమోదయ్యాయి.
Next Story

